మూగబోయిన గొంతులో 

రాగమెవరు తీసేదరో

ఆ… జీరబోయిన గొంతులో 

జీవమేవరు పోసేదరో

ఆ… జానపదం జీవకణంలో ……

జానపదం జీవకణంలో 

జీవాక్షరాలేవరో….

                                (మూగబోయిన)

చినిగిన ఆ దోతి రుమాలును

ఎవరు సుట్టుకుందురో…..

అలిగిన ఆ గొంగడి బొంతను

ఎవరు అలుముకుందురో…..

ఆ…. చిన్నబోయిన

చిన్నబోయిన చేతి కర్రతో

సాము ఎవరు చేసేదరో

                                 (మూగబోయిన)

పగిలిపోయిన డప్పుపై 

దరువులెవరు వేసెదరో

చినిగిపోయిన డోలకి ఆత్మను

ఎదకు ఎవరు హత్తుకునేరు

ఆ… తెగిపోయిన వీణ తీగలను

ఆ… తెగిపోయిన వీణ తీగలను

నరాలెవరు అల్లేదరో

                                  (మూగబోయిన)

అమరుల స్వప్నాల గీతమును 

ఆలపించేది ఎవ్వరో

కన్నతల్లి గర్భ శోకమును

ఏ శిశువు తీర్చునో

ఆ… చిత్తు బొత్తు పాటలను

చిత్తు బొత్తు పాటలను

ఎవరు ఏర్చి పేర్చేదరో

ఎవరు ఏర్చి పేర్చేదరో

                                   (మూగబోయిన)

చేతులెత్తి శరణు కోరితే

చేర దీసేదేవ్వరో

కాటికి కాలుసాపితే

పాడే మోసేదేవ్వరో

ఆ… తుపాకులకు ఎదురు నడిసిన

తూటనేవరు దాసెదరో (2)

తుపాకులకు ఎదురు నడిసిన

తూటనేవరు దాసెదరో 

నా… తూటనేవరు దాసెదరో (4)

మూగబోయిన గొంతులో 

రాగమెవరు తీసేదరో

జీరబోయిన గొంతులో 

జీవమేవరు పోసేదరో

ఆ… జానపదం జీవకణంలో

జానపదం జీవకణంలో 

జీవాక్షరాలేవరో

Related Posts

No related posts found.