గద్దర్: తెలంగాణ ఉద్యమానికి ప్రాణం
గుమ్మడి విట్టల్ రావు, ప్రముఖ కవి మరియు ప్రజా గాయకుడు, 1949లో మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు పేద కుటుంబంలో జన్మించారు. బాల్య సమయంలోనే పేదరికం, సామాజిక అన్యాయాలను ఎదుర్కొంటూ గద్దర్, హైదరాబాద్లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రవేశం
1969లో, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న గద్దర్, ప్రజలకు చైతన్యం కల్పించడానికి బుర్రకథలను ఉపయోగించి ఊరూరా ప్రచారం చేశారు. ప్రముఖ దర్శకుడు బి. నరసింగరావు, భగత్ సింగ్ జయంతి రోజున ఆయన ప్రదర్శనను చూసి ఆసక్తి చూపారు, ఆ తరువాత ప్రతి ఆదివారం ఆయన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో, ఆయన బి. నరసింగరావు ప్రోత్సాహంతో “ఆపర రిక్షా” అనే పాట రాశారు, ఇది ఆయన మొదటి ఆల్బం అయిన “గద్దర్”కు మార్గనిర్దేశం చేసింది.
Read More